నిర్లక్ష్యం తగదు… భయపడితేనే బతుకగలరు

by Shyam |
నిర్లక్ష్యం తగదు… భయపడితేనే బతుకగలరు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రజలను భయపెడుతుంది. కానీ ఆ భయమే ప్రజలను కాపాడుతుందంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికి దూరంగా తను, తన మేనల్లుడు నిర్వాన్ ఖాన్ ఓ చోట ఇరుక్కుపోయామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా లాక్ డౌన్‌ వల్ల కలిగిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబ సభ్యులను చూసి మూడు వారాలయిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రి ఒక్కడే ఇంట్లో ఉన్నారని బాధపడ్డారు సల్లూ భాయ్. ఈ విపత్కర పరిస్ధితిని చూసి భయపడుతున్నామన్నారు.

‘జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా’ డైలాగ్ ఇక్కడ వర్తించదని… ‘జో డర్ గయా సమ్‌ఝో ఓ బచ్ గయా’ అన్నారు. ఎవరైతే కరోనా వైరస్ సంక్రమిస్తుందని భయపడతారో వారే బతికిపోతారని… ఇతరుల ప్రాణాలను రక్షించిన వారవుతారని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్నారు సల్మాన్ అల్లుడు నిర్వాన్. ఇతరులతో కలవడం ప్రమాదమని … ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా వైరస్ వ్యాప్తిని తగ్గించాలన్నాడు. ఈ కథలోని నీతేంటంటే… మేము భయపడ్డాం.. బతుకుతాం .. మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సల్మాన్.

Tags: Salman Khan, Nirvaan Khan, Bollywood, Corona, CoronaVirus, Covid 19, Lockdown

Advertisement

Next Story

Most Viewed