మేనల్లుడి మరణంతో కన్నీరు పెట్టుకున్న సల్మాన్

by Shyam |
మేనల్లుడి మరణంతో కన్నీరు పెట్టుకున్న సల్మాన్
X

మేనల్లుడి మరణంతో కన్నీరు పెట్టుకున్న సల్మాన్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. తన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ మరణంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సల్లూ భాయ్… లవ్ యూ ఆల్వేస్ అంటూ తనతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

అబ్దుల్లా ఖాన్ లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ముంబైలోని దీరుభాయి కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్ లో చేరాడు. కానీ తన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న సల్మాన్ ఖాన్… తర్వాత లీలావతి హాస్పిటల్ కు తరలించారట. అక్కడ చికిత్స పొందుతూనే కన్నుమూశారు అబ్దుల్లా. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే బాలీవుడ్ తో అబ్దుల్లా ఖాన్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా…. చాలా మందితో పరిచయం ఉంది. సల్మాన్ ఖాన్ తో చాలా క్లోజ్ గా ఉండేది ఆయనే. సల్మాన్ తో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాడు అబ్దుల్లా. వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్న వీడియోస్ కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

Tags: Salman Khan, Abdullah Khan, Died, Bollywood

Advertisement

Next Story

Most Viewed