సల్మాన్‌ఖాన్‌పై లూలియా వంతూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-05-12 21:24:35.0  )
సల్మాన్‌ఖాన్‌పై లూలియా వంతూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్‌లో రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి మూవీలో పాటలను ఆష్ కింగ్, లూలియా వంతూర్ వాయిస్ ఇవ్వగా సాజిద్ వాజిద్ సంగీత స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ దేశవ్యాప్తంగా నేడు విడుదల కానుండగా.. సల్మాన్ ఖాన్‌‌తో రిలేషన్‌లో ఉందని పుకార్లు ఎదుర్కొంటున్న లూలియా వంతూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘బీయింగ్ హ్యూమన్‌కు సల్మాన్‌ ఓ చక్కటి నిర్వచనం, అతను ఏది చేసినా వేరొకరికి జీవితాన్ని మెరుగుపర్చాలని అనుకుంటాడు. సహాయం చేయడం, ప్రతి ఒక్కరి జీవితంలో కొత్తదనాన్ని తీసుకొస్తాడు.. (రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి) మూవీలో అతనితో పనిచేయడం సరదాగా, వినోదాత్మకంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story