- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సల్మాన్ దాతృత్వం… 25వేల కుటుంబాలకు ఆర్థిక సాయం
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు డోనేట్ చేసి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఆయన స్ఫూర్తితో ఫ్యాన్స్, సామాన్య ప్రజలు ఎంతో కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుండే సల్లూ భాయ్.. కరోనా కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు మూడు పూటల కడుపునిండా భోజనం పెట్టే బాధ్యతలు తీసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చతికలబడిన 25వేల కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చిన సల్మాన్… వారి ఎకౌంట్లలోకి డబ్బులు వేసేందుకు చర్యలు తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ప్రతినిధి బీఎన్ తివారి వెల్లడించారు.
Tags: Salman Khan, Hollywood, Contribution, CoronaVirus, Covid19