- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘భాయిజాన్’
బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ ఒకరు. మూడు దశాబ్దాలుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడీ..కండల వీరుడు. బెస్ట్ మూవీస్‌ను ఎంచుకుంటూ తన సినిమాల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెస్సేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిర్మాతగాను మారి ఎంతో మంది నూతన నటీనటులను ప్రోత్సహిస్తున్నారు. బుల్లితెరపైనా రియాలిటీ షోస్ చేస్తున్న సల్లూ భాయ్..సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటారు. ‘బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్’ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యను, మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యాన్ని అందించారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఓ గ్రామాన్నే దత్తత తీసుకున్నాడు. 2019 వరదల్లో మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా ఖిద్రాపూర్ గ్రామస్తుల ఇళ్లు కొట్టుకుపోయి నిరాశ్రయులయ్యారు. దీంతో ఆ గ్రామాన్ని పునర్నిర్మించేందుకు ముందుకొచ్చారు సల్లూ భాయ్. గురుగ్రామ్‌లోని ఎలాన్ గ్రూప్‌తో కలిసి ఇళ్లు కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..నెటిజన్లు ఫిదా అయిపోయారు. నిజంగా మీరు ‘సూపర్ స్టార్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.