- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 శాతం తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 20 శాతం క్షీణించాయి. 2020-21లో సుమారు 2,36,802 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇది 2019-20తో పోలిస్తే 25 శాతం క్షీణత. దేశంలో మొత్తం వాహన అమ్మకాల్లో ఈవీల వాటా 1.2 శాతం మాత్రమే. సొసైటీ ఆఫ్ మానుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎస్ఎంఈవీ) ప్రకారం.. మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,43,837 యూనిట్లు ఉండగా, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. వీటిలో 40,837 యూనిట్లు హై-స్పీడ్ విభాగం. ఇవి ప్రాంతీయ రవాణా ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి. మిగిలిన 1,03,000 యూనిట్ల తక్కువ స్పీడ్ ఉన్న స్కూటర్లు. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాలు 60 శాతం తగ్గి కేవల 88,378 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 53 శాతం పెరిగి 4,588 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముందు నుంచే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వృద్ధిని గమనిస్తున్నాం. అయితే, ఇటీవల కొన్ని కారణాల వల్ల అమ్మకాలు స్థిరంగా ఉన్నాయని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెప్పారు.