- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెకెండ్‌వేవ్ ఎఫెక్ట్.. వాటి అమ్మకాల ఊసే లేదు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ వల్ల సాధారణంగా వేసవిలో డిమాండ్ ఉండాల్సిన ఏసీ, కూలర్, రీఫ్రిజిరేటర్ వంటి కూలింగ్ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా క్షీణించాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్థానిక లాక్‌డౌన్ ఆంక్షలు, కరోనా ఆందోళన నేపథ్యంలో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపించడంలేదు. దీంతో ఈ ఉత్పత్తుల విక్రయాలు దాదాపు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో ఏసీ, రీఫ్రిజిరేటర్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయన్నారు.
కరోనాకు ముందు 2019తో పోలిస్తే ఈ రెండేళ్లలో విక్రయాలు భారీగా క్షీణించాయని కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రధానంగా దేశీయ మార్కెట్లలో లీడర్లుగా ఉన్న వోల్టాస్, బ్లూస్టార్, హైయర్, డైకిన్, పానసోనిక్ సహా ఇతర కంపెనీల అమ్మకాలు 2019 తర్వాత 75 శాతం మేర పడిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది మహమ్మారిని అధిగమించి అమ్మకాలు జరుగుతాయని ఆశలు పెట్టుకున్న కంపెనీలు మే వరకూ విక్రయాలను నమోదుచేయలేకపోతున్నాయి. రానున్న రోజుల్లో మూడో వేవ్ కరోనా ఉంటుందంటున్న నిపుణుల హెచ్చరికలతో వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని మార్కెట్లు వర్గాలు తెలిపాయి. మహమ్మారి ముగిసేంతవరకూ అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని ప్రజలు భావిస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.