- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వైసీపీ మేలు చేస్తుంటే.. ఎల్లో మీడియా విషం కక్కుతోంది’
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ప్రభుత్వ సలహాదా సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా కల్పించడంతోపాటు విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి నెలకొల్పేలా చేశారన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన రెండేళ్లలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంతటి స్థాయిలో ఏ ప్రభుత్వమూ ఉద్యోగలు ఇవ్వలేదన్నారు. అన్ని ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మళ్లీ జాబ్ క్యాలండర్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంపై తలా చేస్తున్నా వైసీపీ ప్రభుత్వంపై విషం కక్కడమే లక్ష్యంగా ఎల్లో మీడియా పనిచేస్తుందని మండిపడ్డారు. అలాగే టీచర్ పోస్టుల భర్తీపై సైతం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ మూతపడదు.. ఒక్క టీచర్‌ను కూడా తొలగించమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.