హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : సజ్జల

by srinivas |   ( Updated:2021-09-16 04:44:18.0  )
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : సజ్జల
X

దిశ, ఏపీబ్యూరో : పరిషత్ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సిందని.. కానీ, వాయిదా వేసుకుంటూ వచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేశారని అందులో బాగా నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు.

గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ప్రభుత్వంతో చర్చించకుండానే ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారని మండిపడ్డారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా తన సొంత నిర్ణయాలను తీసుకోలేదని.. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే పాటించారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కలిసి ప్రజాస్వామ్య ప్రక్రియను హత్య చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియను, కౌంటింగ్‌ను అడ్డుకున్నారు. ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed