సైఫ్ ఆటోబయోగ్రఫీ..!

by Shyam |
సైఫ్ ఆటోబయోగ్రఫీ..!
X

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కొత్త దారిలో వెళ్తున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సైఫ్.. రీల్ లైఫ్‌లో హీరోగా ఉన్నా సరే, రియల్ లైఫ్‌లో మాత్రం కొంచెం నెగెటివ్‌గానే కనిపిస్తాడు. మొదటి భార్య అమృతా సింగ్‌కు విడాకులిచ్చేసి, కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణం. కాగా, సైఫ్ తాజాగా చేసిన ప్రకటన అవాక్కయ్యేలా చేసింది. ఇదేదో సినిమా గురించిన అనౌన్స్‌మెంట్ అనుకునేరు.. తన ఆటోబయోగ్రఫీ రాసేందుకు సిద్ధమవుతున్నాడు.

పర్సనల్, ప్రొఫెషనల్ కెరియర్ గురించి ఇందులో ఉండబోతుందని.. కుటుంబం, ప్రేమ, పెళ్లి, లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ గురించి ఇందులో పొందుపరచాలని భావిస్తున్నాడట. ఇప్పటికే చాలా విషయాల్లో మార్పులొచ్చాయని.. వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం మంచిదని.. లేదంటే అవి కాలంతో పాటే కరిగిపోతాయని చెప్పిన సైఫ్. వాటిని గుర్తుతెచ్చుకుని రికార్డ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు తన ప్రయత్నాన్ని స్వార్థపూరిత ప్రయత్నంగా అభివర్ణించాడు. అయితే, అక్టోబర్ 2021లో రిలీజ్ కానున్న సైఫ్ ఆటో బయోగ్రఫీ గురించి కించపరుస్తూ సోషల్ మీడియాలో చాలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఏం చేశావని నువ్వు బయోగ్రఫీ రాస్తున్నావు? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story