ఏపీలో లేటెస్ట్ ట్రెండ్ సేఫ్టీ టన్నెల్స్

by srinivas |
ఏపీలో లేటెస్ట్ ట్రెండ్ సేఫ్టీ టన్నెల్స్
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 329 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు 74, నెల్లూరు 49, గుంటూరు 41 జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో సేఫ్టీ టన్నెల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. తాజాగా ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఉన్న మంగళగిరిలో సేఫ్టీ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ టన్నెల్‌లో 20 సెకెన్లపాటు ఉంటే రకరకాల వైరస్‌లు హరించబడతాయని దీనిని అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ టన్నెల్‌లోపలికి మనిషి రాగానే సెన్సర్లతో పని చేసే పంపులు వాటంతటవే ఆన్ అవుతాయి. వాటి నుంచి రకరకాల రసాయనాలతో కలిసిన హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. దీంతో శరీరంపై నిలిచే సూక్ష్మ జీవులు, వైరస్‌లు వాటంతట అవే నాశనమవుతాయని వారు చెబుతున్నారు.

ఈ సేఫ్టీ టన్నెల్‌ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కాగా ఇలాంటి టన్నెల్‌ను తొలుత విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాతో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. తాజాగా మంగళగిరిలో ఏర్పాటు చేయడం విశేషం.

Tags: safety tunnel, ap dgp office, mangalagiri, vijayawada, guntur,ap

Advertisement

Next Story

Most Viewed