జగన్ ప్రభుత్వంలోనే మహిళలపై అరాచకాలు పెరిగాయి: సాధినేని యామిని

by srinivas |   ( Updated:2021-08-24 06:10:07.0  )
yamini
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని బీజేపీ మహిళా నేత సాధినేని యామిని అన్నారు. మంగళవారం రాష్ట్రంలో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసేందుకు వెళ్లిన తమను కలవనీయకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు. కమిషన్ సభ్యుల వాహనాల వెనుక వైసీపీ నేతల వాహనాలను మాత్రమే పంపించారంటూ పోలీసులపై మండిపడ్డారు. జై జగన్ అన్న వెంటనే వైసీపీ శ్రేణులను పోలీసులు పంపిస్తున్నారని విరుచుకుపడ్డారు.

కమిషన్ సభ్యులను కలవకుండా తమ పార్టీ నేతలను వైసీపీ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దళిత మహిళలు, అమ్మాయిలపై దాడులు పెరిగిపోయాయన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. అన్యాయం జరిగిన తర్వాత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిర్భయ చట్టాన్ని అమలు పరచడం లేదని మండిపడ్డారు. మోసపూరితమైన హామీలను ఇస్తూ ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని సాధినేని యామిని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed