- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచిన్‌ను క్షమాపణ కోరిన ప్రముఖ సంస్థ
దిశ, స్పోర్ట్స్: ప్రముఖ క్రికెట్ బ్యాట్ల తయారీ కంపెనీ ‘స్పార్టన్’తో ఉన్న వివాదానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తెరదించాడు. తనతో కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడిచినందుకు సదరు సంస్థపై సచిన్ ఆస్ట్రేలియన్ కోర్టులో దావా వేశారు. ఒకవైపు దీనికి సంబంధించిన వాదనలు జరుగుతుండగానే.. స్పార్టన్ సంస్థ ‘ఇచ్చిన మాత తప్పినందుకు సచిన్ టెండుల్కర్ మన్నించాలి’ అని క్షమాపణ కోరింది. స్పార్టన్ సీఓఓ లెస్ గాల్ బ్రెత్ రాజీకి రావడంతో కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సచిన్ ఒప్పుకున్నారు. 2016లో స్పార్టన్ సంస్థకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందం మేరకు రాయల్టీ, ఎండార్స్‌మెంట్ ఫీజులను చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సచిన్ పేరును వాడుకోవడం మొదలు పెట్టింది. దీంతో సచిన్ 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని గత ఏడాది ఆస్ట్రేలియన్ కోర్టులో కేసు వేశారు.