ఫైనల్‌లో ధోనీని ముందెళ్లమన్నా : సచిన్

by Shyam |
ఫైనల్‌లో ధోనీని ముందెళ్లమన్నా : సచిన్
X

టీమ్ ఇండియా రెండోసారి ఐసీసీ ప్రపంచ కప్ గెలిచి 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఫైనల్ మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన ప్రతీ క్రికెటర్ తమ మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2011 వరల్డ్ కప్ గురించి ఒక సీక్రెట్ బయట పెట్టాడు. శ్రీలంక విధించిన టార్గెట్‌ను ఇండియా ఛేదించే క్రమంలో యువరాజ్‌ను ఆపి ధోనీని బ్యాటింగ్‌కు వెళ్లమని సచిన్ సూచించాడంట. ‘గంభీర్, కోహ్లీ జోడీ అప్పటికే 87 పరుగుల భాగస్వామ్యం అందించింది. కానీ కోహ్లీ అవుటైన తర్వాత, ఆ సమయంలో స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే.. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగుంటుందని భావించా. ధోనీకి స్ట్రైక్ రొటేట్ చేయడంలో మంచి అనుభవం ఉంది కాబట్టి అతడినే వెళ్ళమని సూచించా’.

కాగా, సచిన్‌కు ఒక సెంటిమెంట్ ఉంది. తాను డగౌట్‌లో కూర్చుంటే మ్యాచ్ ముగిసే వరకు అక్కడి నుంచి కదలడు. అందుకే ఆ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌తో చెప్పి.. ధోనీకి చెప్పమన్నాడట. అయితే, ధోనీ బయోపిక్‌లో ఇలాంటి సీన్ లేకపోవడం గమనార్హం. ధోనీ.. తనంతట తానుగా బ్యాటింగ్‌కు వెళ్తానని కోచ్‌కు చెప్పినట్లు మార్చి తీశారు. ఇన్నాళ్లకు కానీ అసలు విషయం వెలుగులోకి రాలేదు.

Tags: 2011 World cup, Sachin, Gambhir, Dhoni, Batting Order

Advertisement

Next Story