- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 4.74 లక్షల మంది విద్యార్థుల సెకండియర్ విద్యార్థులంతా ఉత్తీర్ణులవుతున్నారు. అయితే పాస్ అయినట్లు ప్రకటించడం, మార్కులను వేయడం తదితరాలకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, అది అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించే నివేదికను పరిశీలించి ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. నిర్దిష్టంగా విధివిధానాల తయారీ కూడా ఉంటుందని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగిన తర్వాత సెకండియర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అనధికార వార్తలు బుధవారం ఉదయానికే వెలువడ్డాయి. అయితే తొలుత ఈ వార్తలను ఖండించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాయంత్రానికి అధికారికంగా ప్రకటన చేశారు.
ఫస్టియర్‌లో సాధించిన మార్కుల ప్రకారం వీరికి సెకండియర్‌లో మార్కులు ఉండవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు వారం రోజుల క్రితమే సూచనప్రాయంగా తెలిపారు. అయితే గతేడాది ఫస్టియర్ పరీక్షల ఫలితాలను వెల్లడించకుండా అందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. కానీ కొన్ని బ్యాక్‌లాగ్ పేపర్లు ఉన్నందున ప్రభుత్వం త్వరలో రూపొందించబోయే విధివిధానాల్లో స్పష్టత రానున్నది. ఫస్టియర్‌లో పరీక్ష ఫీజు కట్టిన ప్రతీ ఒక్కరికి కనీసంగా 45 మార్కుల చొప్పున అన్ని పేపర్లకూ వేయాలన్న ప్రతిపాదన ఉన్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఆ ప్రకారమే సెకండియర్ మార్కులు కూడా ఉంటాయన్నారు. కానీ తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సమర్పించే నివేదికకు అనుగుణంగా మార్కులు, గ్రేడింగ్ లాంటివి ఉంటాయని చెప్పడంతో విధి విధానాల ద్వారానే సందేహాలు నివృత్తి కానున్నాయి.