- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టాలి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మొదటి రోజు హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ఉన్నత పాఠశాలకు
40 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు సమర్థవంతంగా చేపట్టారని అభినందించారు. పిల్లలను పేరెంట్స్ ధైర్యంగా పంపిస్తామన్నారని, డిఈవోలు, ప్రధానోపాధ్యాయులు గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
డివోలు, ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పారు. 30 లక్షల మంది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులందరూ వ్యవహరించాలని సూచించారు. రెసిడెన్షియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఏడాది లక్ష ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారని పేర్కొన్నారు. ఇంటర్ లో లక్షమంది వరకు పిల్లలు ప్రభుత్వ కాలేజీలో చేరారని, ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెండున్నర లక్షలకు పైగా విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.