- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచంలోనే అందమైన దోమ ‘సబెథెస్’
దిశ, ఫీచర్స్ : అన్ని దేశాలను భయపెట్టే ఓ చిన్న జీవి ‘దోమ’. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్‌కు కారణమవుతున్న ఈ రక్తం తాగే ప్రాణిని.. చంపేందుకు కాయిల్స్, బ్యాట్స్, ఆలౌట్ అంటూ రకరకాల రివెంజ్ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఓ దోమను చూస్తే మాత్రం అరే భలే ఉందంటూ దాన్నే చూస్తూ ఉండిపోతారంటే నమ్మండి. చూడ్డానికి అదేమైనా వర్ణరంజితమైన సీతాకోకచిలుకా? ఎరుపు ముక్కున్న రామచిలుకా? అంటారా? అంటే కాదు కానీ చూడ్డానికి బాగుంటుంది.
మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల్లో కనిపించే ‘సబెథెస్ దోమ’లను ఓ అంతుచిక్కని మస్కిటో ఫ్యామిలీగా చెప్పొచ్చు. రంగులతో కూడిన ఈకలు, ఆకుపచ్చ రంగు దేహంతో పాటు దాని రెండు వెనుక కాళ్లు కూడా ఆకట్టుకునే రంగులతో ఉంటాయి. ప్రకృతిలోని చిన్న కదలికలకు, కాంతి తీవ్రతలో మార్పులకు ప్రతిస్పందించే ఈ దోమను ఫొటో తీయాలంటే కాస్త కష్టమేనని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ గిల్ విజెన్ తెలిపాడు. అంతేకాదు ఈ దోమలు ఎప్పుడూ ఒంటరిగా కాకుండా గుంపులుగుంపులుగా సంచరిస్తుంటాయి. దీని రూపంతో పాటు, ఈ దోమల వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? లేదా? ఈ దోమలు ఎటువంటి రోగాలు వ్యాప్తి చేస్తాయి వంటి అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.