వైరల్‌గా మారిన RX100 హీరో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో

by Anukaran |   ( Updated:2023-12-17 16:38:35.0  )
Karthikeya
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ లోహితతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. ఈనెల 21న ఉదయం 9:47 నిమిషాలకు ముహూర్తం ఖరారు కాగా.. రంగారెడ్డి జిల్లా ర్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్‌ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. అంగరంగ వైభవంగా జరిగే వేడుకలో లోహిత మెడలో కార్తికేయ మూడుముళ్లు వేయనుండగా.. బంధుమిత్రులు, టాలీవుడ్ ప్రముఖులు ఈ ఘట్టానికి సాక్ష్యంగా నిలువనున్నారు. లోహిత తండ్రి లెక్కల చిన్న కొండారెడ్డి కర్నూలుకు చెంది వ్యాపారస్తులు కాగా.. లోహిత, కార్తికేయ పదేళ్లుగా ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. పెద్దలు పెళ్లి అని ఫోర్స్ చేయడంతో కార్తికేయ.. లోహితను ఎంచుకున్నాడని, ఇది లవ్ మ్యారేజ్ కాదు పక్కా అరేంజ్‌డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed