- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా సైన్యంలో కరోనా కలకలం
కరోనా వైరస్ చైనాలో పుట్టినా పక్కనే ఆనుకొని ఉన్న రష్యాకు మాత్రం వెంటనే పాకలేదు. ప్రపంచమంతా జనవరి నుంచే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. రష్యాలో మాత్రం గత నెల రోజులుగా మాత్రమే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జనవరి మొదటి వారంలోనే చైనాతో ఉన్న సుదీర్ఘ సరిహద్దును చైనా మూసేయడంతో తొలుత వైరస్ నుంచి రక్షించుకోగలిగింది. కాని యూరోప్ నుంచి రష్యాకు కరోనా వ్యాపించడం మొదలయ్యాక అక్కడ పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజా రష్యా సైన్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు 874 మంది సైనికులకు కరోనా సోకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా బారిన పడిన 379 మంది సైనికులు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా, మిగిలిన సైనికులను వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. కాగా, చికిత్స పొందుతున్న వాళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని రష్యా ప్రకటించింది. రష్యాలో మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. కాగా, లాక్‌డౌన్ నిబంధనల అమలు కోసం రష్యాలో సైన్యాన్ని దించింది. అనేక మంది సైనికులు విధుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సైనికులకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కరోనా తీవ్రత పెరిగిపోవడంతో మే 9న జరగాల్సిన సైనిక కవాతును రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరవధికంగా వాయిదా వేశారు. కాగా, ఈ సైనిక కవాతు కోసం ఇప్పటికే సైనికులు పలుమార్లు రిహార్సల్ చేశారు. ఆ సమయంలో సైనికులందరూ వ్యక్తిగత దూరం పాటించినట్లు వీడియో రికార్డింగ్‌లో తేలింది. దీంతో సైనికులకు ఎక్కడ నుంచి కరోనా సోకిందో ఆరా తీస్తున్నారు.
Tags : Kremlin, Russia, Army, Coronavirus, Covid 19, Vladimir Putin