ఆగస్ట్ 14న వ్యాక్సిన్ అందిస్తాం : రష్యా

by vinod kumar |
ఆగస్ట్ 14న వ్యాక్సిన్ అందిస్తాం : రష్యా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు పోటీపడి వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ ఆగస్ట్ 15 వరకు వ్యాక్సిన్ ను తెస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా సైతం ఆగస్ట్ 14 వరకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది.

రష్యాకు చెందిన గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయోలజీ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీలో ఎంతో పురోగతి సాధించిందని ఆ దేశం ప్రకటించింది. ఇప్పటికే సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, వలంటీర్లకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చామని అంటోంది. తమ వ్యాక్సిన్ ఆగస్టు 14 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని, సెప్టెంబరు నుంచి ఫార్మా కంపెనీల్లో భారీగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని గమాలెయ్ సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed