- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్ సునీత రెండోపెళ్లి.. వరుడు అతడే ?
దిశ, వెబ్‌డెస్క్: మధురమైన గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న సింగర్ సునీత.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. భర్తతో విభేదాలతో విడాకులు తీసుకొని కొన్నేళ్ల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న బ్యూటీఫుల్ సింగర్… న్యూ జర్నీ ప్రారంభించేందుకు లేటెస్ట్‌గా ఓ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినపడుతున్నాయి. ఇటీవలే సునీతకు కాబోయే హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెతో మాట్లాడారని, ఇరువురి తరపు బంధువులు ఓకే చెప్పారని, దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.
15ఏళ్లకే టాలీవుడ్‌కు పరిచయమైన సునీత.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించిన గులాబీ సినిమాలో ‘ఈ వేలలో నీవు ఏం చేస్తు ఉంటావో’ అనే సాంగ్ పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి కెరీర్‌లో దూసుకెళ్లిన సింగర్.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఎన్నో సాంగ్స్ పాడి అభిమానులను సంపాదించుకున్నారు. 19ఏళ్లకు వివాహం చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో వచ్చిన మనస్పర్థలతో డైవర్స్ తీసుకున్న ఆమె పిల్లలతో కలిసి ఉంటోంది. ఈనేపథ్యంలోనే కొద్దినెలల క్రితం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ నచ్చజెప్పడంతో మళ్లీ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న సునీత.. మళ్లీ పెళ్లికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రేక్షకులు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఫ్యూచర్‌లో మరెంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. అటు సింగర్ సునీతను మ్యారేజ్ చేసుకుబోయే వ్యక్తిది కూడా రెండో పెళ్లే అనే టాక్ వినపడుతోంది. అతను ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న బిజినేస్‌మెన్ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే రెండో పెళ్లిపై ఇంత గాసిప్స్ వస్తున్నా సునీత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.