చందమామకు పెళ్లి?

by Jakkula Samataha |
చందమామకు పెళ్లి?
X

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తన కన్నా ముందే చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకున్నా సరే.. కెరియర్‌పై ఇంట్రెస్ట్‌తో మ్యారేజ్‌కు దూరంగా ఉంది కాజల్. ఐతే ఈ మధ్య లక్ష్మీ ప్రసన్నతో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న కాజల్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. తనకు కాబోయే భర్త పొసెసివ్‌గా ఉండాలని, అందంతో పాటు భక్తి కూడా ఉండాలని చెప్పింది.

ఇక అప్పటి నుంచి ఈ పంచదార బొమ్మ పెళ్లిపై రూమర్లు ఊపందుకున్నాయి. తాజాగా అలహాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను కాజల్ మ్యారేజ్ చేసుకోబోతుందని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై కాజల్ త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయనుందని చెప్తున్నారు. మరి కాజల్ ఈ రూమర్లపై స్పందిస్తుందా? వరుడు ఎవరు? అన్న విషయంపై క్లారిటీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

కాగా కాజల్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పాటు ఇండియన్ 2, హే సినామిక చిత్రాలతో బిజీగా ఉంది.

Advertisement

Next Story