అమ్మా అను.. డైరెక్టర్‌తో డేటింగా?

by Shyam |   ( Updated:2021-02-21 04:20:56.0  )
Anu Emmanuel
X

దిశ, సినిమా : అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ పెళ్లికి రెడీ అవుతోందని టాక్. ఇప్పటికే ప్రేమాయణం నడిపిస్తున్న భామ.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతోందని సమాచారం. త్వరలోనే ఈ గుడ్ న్యూ్స్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా… ఆక్సిజన్ సినిమా దర్శకులు జ్యోతి కృష్ణ. ఈ చిత్రం సమయంలోనే ప్రేమలో పడిపోయిన ఈ ఇద్దరు.. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక జ్యోతి కృష్ణ ప్రముఖ నిర్మాత ఏంఎం. రత్నం కుమారుడన్న విషయం తెలిసిందే.

కాగా అను ఇమ్మాన్యుయేల్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మజ్ను, నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు, అజ్ఞాతవాసి, అల్లుడు అదుర్స్’ లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన అను.. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకులు అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ‘మహాసముద్రం’లో కీలక పాత్రలో కనిపించబోతోంది.

Advertisement

Next Story