- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కుటుంబాలు ఆగమవుతున్నాయ్.. వేతనాలు ఎప్పుడిస్తరు..?
by Shyam |
X
దిశ, భూపాలపల్లి : వేతనాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 14 తేది వచ్చినప్పటికీ ఇంతవరకు వేతనాలు రాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆందోళన తెలిపారు.
తమ పిల్లల చదువులకు ఫీజులు ఎలా చెల్లించాలని వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 5వ తేదీలోగా వేతనాలు అందుతుండగా తమ పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు వేతనాలు సకాలంలో అందేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.
Advertisement
- Tags
- bhoopalapalli
Next Story