- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొని బస్సు బోల్తా
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ రాష్ట్రం కాచిగూడకు చెందిన టీఎస్ 08 జెడ్ 0054 నంబరు గల ఆర్టీసీ బస్సు కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు మొత్తం 32మంది ప్రయాణికులతో వస్తుంది. ఈ క్రమంలో బస్సు ఉండవల్లి మండల కేంద్రానికి సమీపంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు రాముడు, రవికుమార్, నరసింహులు అనే ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో వైద్యం కోసం కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు వెంబడే వస్తున్న కారు బస్సు వెనుక భాగంలో ఢీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.