- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉరి తీయడమే కరెక్ట్.. SR ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
దిశ, ఎల్బీనగర్: అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్న బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నిందితుడికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కిరాతకులను బతకనివ్వొద్దని, ఉరి తీయాలని అభిప్రాయపడ్డారు.
చిన్నారి మృతిచెంది ఐదురోజులైనా ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ స్పందించకపోవడం దారుణం అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. చిన్నారి హత్య అత్యంత దారుణమన్నారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.