నేడు ఓయూకు RSP.. నిరుద్యోగ సమస్యలపై చిట్ చాట్

by Shyam |   ( Updated:2021-11-24 03:11:21.0  )
నేడు ఓయూకు RSP.. నిరుద్యోగ సమస్యలపై చిట్ చాట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మబలిదానాలు చేసుకుంటున్న నిరుద్యోగుల పక్షాన నిలిచేందుకు మాజీ ఐపీఎస్, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడుం బిగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్ల కోసం అదిగో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ కాలం వెళ్లదీస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సమాయత్తమయ్యారు.

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులతో చర్చించేందుకు ఆర్ఎస్పీ సిద్ధమైనట్లు విద్యార్థి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీలో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం జరుపనున్నారు. ఈ విషయాన్ని రీసర్చ్ స్కాలర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, యువతకు భరోసా కలిగించేందుకు ఆర్ఎస్పీ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story