గని ప్రమాద మృతులకు రూ.కోటి పరిహారం : సీఎండీ

by Aamani |   ( Updated:2021-11-10 21:17:05.0  )
crime
X

దిశ,బెల్లంపల్లి: సింగరేణి ఎస్‌ఆర్‌పీ-3, 3ఏ గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికుల మృతి చెందడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై తక్షణమే విచారించి బాధ్యులను కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సింగరేణి అండగా ఉంటుందని, కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు కంపెనీ ద్వారా చెల్లించే సొమ్ము తక్షణమే అందజేస్తామని, మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్యాట్యూటీ మొదలైనవి కలిపి రూ.70 లక్షల నుండి కోటి రూపాయల వరకు చెల్లింపులు చేస్తామని యాజమాన్యం ద్వారా ప్రకటించారు. ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. కార్మికుని మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారి లేని లోటు కంపెనీ తీర్చలేకపోయినప్పటికీ తోటి సింగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందని శ్రీధర్ ప్రకటించారు.

మంచిర్యాల గని ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎండీ

Advertisement

Next Story