వ్యాక్సిన్ వేయించుకోండి.. రూ.7 కోట్లు పట్టేయండి

by vinod kumar |   ( Updated:2021-05-14 06:56:53.0  )
వ్యాక్సిన్ వేయించుకోండి.. రూ.7 కోట్లు పట్టేయండి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇండియాలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా కరోనా భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా .. వేయించుకునేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజల్లో తొలుత వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెనకడుగు వేయగా.. ఇప్పుడు అనుమానాలు తొలగిపోయాయి.

వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అనేక దేశాలు ఆఫర్లు పెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు బహుమతులు ప్రకటించగా.. తాజాగా ఒహియోలో వినూత్న ఆఫర్ పెట్టారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి లాటరీ ఇస్తామంది.

ఈ లాటరీ ద్వారా రూ.7.34 కోట్లు పొందవచ్చని ఒహియో గవర్నర్ మైక్ డివైన్ చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు చెప్పారు.

Advertisement

Next Story