ఓటుకు నోటు.. సింగాపూర్ చెక్‌‌పోస్టు వద్ద రూ.4లక్షలు పట్టివేత

by Sridhar Babu |
ఓటుకు నోటు.. సింగాపూర్ చెక్‌‌పోస్టు వద్ద రూ.4లక్షలు పట్టివేత
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచారానికి తెరపడటంతో ఇప్పుడు ఓటుకు నోటు అంటూ ఒక్కో ఓటుకు రూ. 6 వేల నుంచి 10 వేల దాకా పంచుతున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. హుజురాబాద్‌లో సైలెన్స్ పీరియడ్ కారణంగా సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే అనుమానం వచ్చి టీఎస్ 08 హెచ్ఈ 0599 వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా అందులో రూ. 4 లక్షల 96 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. ఉపఎన్నికలు ముగిసే వరకు అన్ని చెక్ పోస్టులలో స్టాటికల్ సర్వేలెన్స్ టీమ్‌లు 24 గంటలు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు, మద్యం పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

Next Story