రూ.30ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

by Sridhar Babu |
రూ.30ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాచలం పట్టణంలో మరోసారి భారీ ఎత్తున గంజాయి ల‌భ్య‌మైంది. భ‌ద్రాచాలం ప‌ట్ట‌ణ స్టేష‌న్ ఎస్‌ఐ మహేష్ సిబ్బందితో క‌లిసి ఆదివారం కూనవరం రోడ్ ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద నుంచి పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తుండగా కారు అనుమానాస్పదంగా వెళ్తూ క‌నిపించింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని గుర్తించారు.

గంజాయిని హైదరాబాద్‌కు త‌ర‌లిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 204 కేజీలు ఉండ‌గా, దీని విలువ రూ.30 లక్షల 60వేలు ఉంటుంద‌ని తెలిపారు. కార్ డ్రైవర్ మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం క‌ల‌క‌త్తా తండాకు చెందిన వాంకుడోతు బాల కుమార్‌గా నిర్ధారించారు.

Advertisement

Next Story