‘చేనేత చేయూత’కు రూ.30 కోట్లు మంజూరు

by Shyam |
‘చేనేత చేయూత’కు రూ.30 కోట్లు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేనేత చేయూత పథకాన్ని ప్రభుత్వం జూన్ 14న పున:ప్రారంభించింది. ఈ పథకానికి రూ.30 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ బీసీ సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద చేనేత, మరమగ్గ కార్మికులు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను 16శాతాన్ని ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.

రాష్ర్టంలోని సూమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు ఫథకం భరోసా ఇవ్వనుంది. రాష్ర్టంలో ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడితోపాటు డెయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు , ఇతర చేనేత పనివారు కూడా ఈ పథకంలో చేరే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

Advertisement

Next Story

Most Viewed