భద్రాద్రిలో రూ.2 లక్షల విలువైన గంజాయి లభ్యం.. ముగ్గురు అరెస్టు

by Sumithra |
భద్రాద్రిలో రూ.2 లక్షల విలువైన గంజాయి లభ్యం.. ముగ్గురు అరెస్టు
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు రూ. 2 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం పట్టణ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. శనివారం ఆయన ఆధ్వర్యంలో బస్టాండ్ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా, అందులో 10 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది.

దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. దీని విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ సత్యనారాయణ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా పై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ తనిఖీలలో ఎస్ఐలు మురళీకృష్ణ, ప్రసాద్‌రెడ్డి, రాజేష్, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్ వీరబాబు, బాబు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story