ఇక మీదట రూ.2 వేలు రావు..

by  |
ఇక మీదట రూ.2 వేలు రావు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యే వారికి గతంలో ఏపీ ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయం ప్రకటించింది. తాజాగా ఆ సాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అదేవిధంగా కరోనాతో మృతిచెందిన వారి భౌతిక కాయాలకు ప్రభుత్వం ద్వారా ఖననం జరిగితే.. బాధిత కుటుంబాలకు అందించే రూ. 15వేలను కూడా కొన్ని చోట్ల నిలిపివేశారు. ఇదిలాఉండగా, ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారికి రూ.2000 చెల్లించనున్నట్లు ఏప్రిల్ నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed