- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్కు ధరించకుంటే చలానా.. పోలీసుల వార్నింగ్
by Shamantha N |
X
ముంబయి : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు చలానాలు పంపుతారు. హెల్మెట్ ధరించకుంటేనో, సీటు బెల్టు పెట్టుకోకుంటేనో సాధారణంగా ఉల్లంఘనులకు చలానాలు జారీ అవుతాయి. కానీ, మహారాష్ట్రలో మహమ్మారి కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్న వేళ ముంబయి పోలీసులు కరోనా నిబంధనల ఉల్లంఘిస్తున్నవారిపై కొరడా ఝుళిపేందుకు సిద్ధమయ్యారు. ఇకపై పబ్లిక్ ప్లేసుల్లో మాస్కు ధరించకున్నా చలానా విధించనున్నారు. ఇప్పటి వరకు హెల్మెట్, సీటు బెల్టు ధరించనివారికి భద్రతను, ప్రాణాల విలువను గుర్తించాలని చలానాలు విధించే వారమని, ఇకపై అదే కారణంతో మాస్కులు ధరించకుంటే కూడా చలానాలు జారీ చేస్తామని తెలిపారు. హెల్మెట్ ధరించకుంటే రూ. 500, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. 500లు, మాస్కు లేకుంటే రూ. 200ల ఫైన్ విధిస్తామని ముంబయి పోలీస్ ట్వీట్ చేసింది.
Advertisement
Next Story