రిజిస్ట్రేషన్ల విభాగానికి రూ.కోటి నిధులు విడుదల

by Shyam |
రిజిస్ట్రేషన్ల విభాగానికి రూ.కోటి నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నిధులను విడుదల చేసింది. ఈమేరకు జిఓ 258ను జారీ చేస్తూ మొదటి క్వార్టర్‌కు రూ. 50 లక్షలు, రెండవ క్వార్టర్‌కు రూ. 50లక్షలుగా పేర్కొన్నది. గత ఆగష్టు చివరి వారం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినందున ఆ విభాగం ఆర్థిక వనరులు లేకుండా పోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో పొందుపరిచిన వెసులుబాటును పరిగణలోకి తీసుకుని ఈ నిధులను విడుదల చేసినట్టు ప్రభుత్వం వివరించింది.

Advertisement

Next Story