ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by Shyam |
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

ర్ఆర్ఆర్ మూవీ టీం నుంచి అప్‌డేట్ వచ్చింది. అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమాను జనవరి 8, 2021లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. చాలా వెయిట్ చేయించామని, కానీ ఇప్పటి నుంచి అప్‌డేట్ ఇస్తామని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్.

మీ లవ్ అండ్ సపోర్ట్ మేము చేసే హార్డ్ వర్క్, హెక్టిక్ షెడ్యూల్స్‌ను విలువైనవిగా మార్చేస్తున్నాయని ట్వీట్ చేసింది. అభిమానులకు గొప్ప అనుభూతిని ఇచ్చేందుకు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని తెలిపింది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశామని తెలిపిన చిత్ర యూనిట్… అందుకే మొదట ప్రకటించిన తేదికి రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ట్వీట్ చేసింది. ఇది కొద్దిగా నిరాశ కలిగించే విషయమే అయినా… సినిమా ఔట్‌పుట్ బెస్ట్‌గా ఉండాలనే ఇలా చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

అంటే సినిమా కోసం మరో ఏడాది వెయిట్ చేయక తప్పదన్న మాట. అయినా కూడా మూవీ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం.. ఆర్ఆర్ఆర్ టీం అధికారిక ప్రకటన ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story