- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతన్ని అరెస్టు చేయండి.. మున్సిపల్ కార్మికుల ఆందోళన
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్డును అనుకుని చేపట్టిన ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు శనివారం ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిపై ఆక్రమణ దారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్న తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకివెళితే.. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనక నుంచి వస్తున రోడ్డు వెడల్పు పనులను ఇటీవల అందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలను తొలగిస్తుండగా రాయల్ మెడికల్ యజమాని ఇఫ్తేకార్ అందులో తన స్థలం ఉందని, కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చానని అధికారులతో వాగ్వివాదానికి దిగాడు. తనకు సమాచారం ఇవ్వకుండా తన స్థలంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఆవేశంతో రాయల్ మెడికల్ యజమాని ఇఫ్తేకారు బోధన్ మునిసిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో పోశెట్టి, సాయిలు, వీరయ్య, పోచయ్య గాయాల పాలయ్యారు. దీంతో బాధితులు తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.