రాయల్ గ్యాస్ డీలర్ షిప్ రద్దు.

by srinivas |
రాయల్ గ్యాస్ డీలర్ షిప్ రద్దు.
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని మంగళగిరి పట్టణంలో ఉన్న రాయల్ గ్యాస్ కంపెనీ డీలర్ షిప్‌ను జాయింట్ కలెక్టర్ రద్దు చేశారు. గత కొద్ది రోజుల కిందట పట్టణంలోని గ్రేట్ ఇండియా హోటల్ ఎదుట గల గ్యాస్ గోడౌన్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిపారు. గ్యాస్ సిలిండర్ల నిల్వల్లో వ్యత్యాసాలు ఉండటం, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారుల తనిఖీల్లో బయట పడింది.

పట్టణ శివార్లలో గోడౌన్ నిర్వహణకు అనుమతులు పొంది పట్టణంలోని గ్యాస్ కంపెనీ కార్యాలయంలో గోడౌన్ నడపటాన్ని అధికారులు కనుగొన్నారు.దీనితో జిల్లా జాయింట్ కలెక్టర్ డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనావాసాల మధ్య గ్యాస్ గోడౌన్ ఉండటం ప్రమాదకరం. దశాబ్దాల కాలంగా సదరు డీలర్ ఆడిందే ఆటగా మారింది. ప్రస్తుతం ఈ డీలర్ షిప్ రద్దు కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story