విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

by srinivas |
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో రౌడీ షీటర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి మంగళవారం రాత్రి తన ఇంటి సమీపంలో ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో బైక్‌లపై ఇద్దరు, కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిపై దాడి చేశారు. మొదట ఇనుపరాడ్లతో తలపై దాడిచేసి ఆపై కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దీంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

గతంలో బండరెడ్డిపై నేర చరిత్రలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రెండు హత్య కేసుల్లో బండరెడ్డి పాలుపంచుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలే కాలంలో బండరెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులతో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అతడితో తిరిగిన వ్యక్తులు ఆధిపత్యం కోసమే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story