- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకలి తీర్చే ‘రోటీ బ్యాంక్’
దిశ, వెబ్ డెస్క్: స్వచ్ఛంద సంస్థలు, సెలెబ్రెటీలు, పారవేత్తలు, సాధారణ పౌరులు, సేవాతత్పరులు ఇలా ఎంతోమంది మానవతా హృదయులు ముందుకు వచ్చి అనాథలు, భిక్షగాళ్లతోపాటు ఉపాధి కోల్పోయిన ఎంతోమంది కడుపు నింపుతున్నారు. కరోనా కరళనృత్యం చేస్తున్న వేళ.. తోటి మనుషులకు సాయం చేస్తూ తాము అండగా ఉన్నామని చాటి చెబుతున్నారు. ‘రోటీ బ్యాంక్’ కూడా అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. పేరు ఒక్కటే, చేసేపని కూడా ఒక్కటే.. కానీ, రాష్ట్రాలే వేరు. సిక్కిం, నోయిడా, ఇండోర్ లలో ‘రోటీ బ్యాంక్’ సేవలు సాగుతున్నాయి.
నోయిడాలో సొసైటీ సభ్యులు..
కరోనా కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరికీ తోచినంతా వాళ్లు దానం చేస్తున్నారు. కొంతమంది తమకు వీలైనంతా ఆహారం అందిస్తున్నారు. ఇంకొంతమంది దాతల సాయంతో ఆహారం సమకూర్చి అందిస్తున్నారు. ఇలా ఎంతోకొంతమంది తాము ఏదో విధంగా ముందుకు వచ్చి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారికి సరుకులు అందిస్తున్నారు. విరాళాలు అందిస్తున్నారు వారు కొందరైతే.. సేకరిస్తున్నారు వారు మరికొందరు. నోయిడాకు చెందిన శైలేష్ యాదవ్ కూడా ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చాలని భావించారు. దాంతో తమ అపార్ట్‌మెంట్‌లోని కొంతమంది సభ్యులతో కలిసి చర్చించాడు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఏప్రిల్ 12న ‘రోటీ బ్యాంకు’ను మొదలుపెట్టారు. మొదటి రోజు 400 చపాతీలు చేసి కూలీలకు అందించారు. ఆ తర్వాత ఈ విషయం చుట్టు పక్కల సొసైటీలు, అపార్ట్ మెంట్‌లకు తెలియడంతో తాము కూడా చపాతీలు చేసేందుకు ముందుకు వచ్చారు. మొదటి రోజు 400 చపాతీలతో మొదలైన ‘రోటీ బ్యాంక్’ సేవలు .. ఇప్పుడు 15 వేలకు పైగా చపాతీలు పంచుతూ ఆదర్శంగా నిలుస్తోంది. మొదట మూడు సొసైటీలే చపాతీలు అందించినా ప్రస్తుతం 25 సొసైటీలు రోటీబ్యాంక్‌కు చపాతీలు అందజేస్తున్నాయి. తమ సొసైటీ సభ్యులు చపాతీలు తయారు చేసి సిద్ధంగా ఉంచితే నోయిడా అథారిటీ అధికారులు వాహనం పంపించి కూలీలకు పంపిణీ చేస్తున్నారని శైలేష్ చెప్పారు. దాదాపు నాలుగు వేలమంది ఆకలి తీరుస్తున్న రోటీ బ్యాంక్, ఈ పదకొండు రోజుల్లో లక్షకు పైగా చపాతీలను కూలీలకు పంపిణీ చేసింది.
సిమ్లాలో ఫుడ్ ఆన్ వీల్స్…
కరోనా కారణంగా అన్నార్తులే కాదు, పోలీసులు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు కూడా ఆకలి బాధను అనుభవిస్తున్నారు. దాంతో సిమ్లాలోని సిక్కులు వారి ఆకలి తీర్చేందుకు వినూత్నంగా ముందుకు కదిలారు. ఓ మొబైల్ వ్యానులో ఆహారాన్ని సమకూర్చుకుని స్థానిక ఆసుపత్రులకు వెళ్లి పంచిపెడుతున్నారు. కొండ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందజేస్తున్నారు. పేదలు, వలస కూలీలు, అనాథలతో ఆకలితో కనిపించే ప్రతి ఒక్కరికీ ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు. ‘రోటీ బ్యాంక్’ పేరుతో మొబైల్ వ్యానులో రోజంతా సిమ్లా నగరాన్ని చుట్టేస్తూ అందరి ఆకలి తీరుస్తున్నారు. ప్రతిరోజు వాళ్లు 1,000కి పైగా ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్‌తోపాటు.. అవసరమున్న వారికి టీ, బిస్కెట్లు కూడా అందజేస్తున్నారు.
వీధి శునకాల కోసం
పేదలు, ఉపాధి కోల్పోయిన వారి సంగతి సరే కానీ.. లాక్‌డౌన్ వల్ల మూగ జీవాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీధికుక్కలు, ఆవులు, కోతులు ఇతర జీవాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అందుకే వాటికోసమే ప్రత్యేకంగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ‘రోటీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ‘డాగిటైజేషన్ ఇన్ ఇండోర్’ పేరుతో ప్రచారం సాగించే వందన జైన్ అనే మహిళ ఆలోచన ఫలితమే ఈ బ్యాంకు. దీంతో అయిదు వేల రోటీలను తయారు చేసి ఎన్జీవోల సాయంతో వీధి కుక్కలకు, ఇతర జీవులకు రోటీలు అందిస్తున్నారు. వందన అండ్ గ్రూప్ ప్రతి రోజు 5 వేల రోటీలు తయారు చేసి.. ఇండోర్ వీధుల్లోని మూగ జీవాలకు అందజేస్తుంది. అంతేకాదు కోవిడ్ నేపథ్యంలో.. శునకాలను ‘స్టెరీలైజేషన్ క్లినిక్స్’ కు తరలిస్తుంది.
tags :coronavirus, lockdown, help, food, hungry people, roti bank