అన్నార్తులను ఆదుకుంటున్న నెల్లూరు రోటరీ క్లబ్

by srinivas |
అన్నార్తులను ఆదుకుంటున్న నెల్లూరు రోటరీ క్లబ్
X

కరోనా కష్టాలు వెన్నాడుతున్న ప్రస్తుత తరుణంలో అన్నార్తుల వెతలు తీర్చేందుకు నెల్లూరు జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ నడుం బిగించింది. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి నిరుపేదలకు జీవనోపాధి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదల కోసం గత నెల 21 నుంచి రోటరీ క్లబ్ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న రోటరీ క్లబ్ ఆవరణలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. సుమారు 200 మంది నిరుపేదలు భోజనం చేస్తున్నారని రోటరీ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. లాక్‌డౌన్ ముగిసేంత వరకు ఎంత మంది పేదలు వచ్చిన భోజన సదుపాయం కల్పిస్తామని వారు భరోసా ఇస్తున్నారు. కేవలం ఆహారంతోనే సరిపెట్టకుండా వారికి మంచినీళ్లు, బిస్కెట్లు వంటివి కూడా అందజేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఔన్నత్యాన్ని చాటుకుంటోంది. కాగా, రోటరీ క్లబ్ ఆఫ్ నెల్లూరు బ్లడ్ బ్యాంక్ సేవలు, ఉచిత నేత్ర పరీక్షలు, ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తూ పేదలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే

Tags: nellore, rotary club, free food, lockdown, free service

Advertisement

Next Story

Most Viewed