- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాళ్ల సినిమాలు బాయ్‌కాట్ చేయాలి : రూపా గంగూలీ
‘బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాలున్నాయని.. ఆయన ఆత్మహత్య కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి’ అంటూ ఇప్పటికే కొందరు మాట్లాడారు. అందులో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కూడా ఒకరు. సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్లు ఆమె గతంలో అభిప్రాయపడ్డ గంగూలీ.. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ.. ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు ట్వీట్లను ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నెపోటిజాన్ని ప్రోత్సహించే వారి సినిమాలను చూడటం ఎప్పుడో మానేశానని తెలిపింది.
‘ఇండస్ట్రీలో నెపోటిజం తీవ్రంగా పెరిగిపోయింది. కొంతమంది వ్యక్తుల వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు బలైపోతున్నారు. దేశంలోని చిన్న చిన్న గ్రామాల నుంచి చిత్ర సీమలోకి అడుగుపెట్టే ఎంతో మంది ప్రతిభావంతులకు ఇందులోకి రావద్దనే మెసేజ్ ఇస్తున్నారా? నెపోటిజం అంతటా ఉంటుంది, కాదనను. వాళ్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాయం చేయాలని కోరుకుంటారు. అందులో తప్పు లేదు. కానీ వారి వల్ల ఎంతోమంది బలైపోవడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే నెపోటిజాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ల సినిమాలను బాయ్‌కాట్ చేయాలి’ అంటూ రూపా గంగూలీ పిలుపునిచ్చారు.
ఇక గత నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులను విచారించిన పోలీసులు.. మరికొంత మందిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.