- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెంచ్ వార్ లో బంకర్.. మరి ఇప్పుడూ ?
దిశ, ఫీచర్స్ : పూర్వకాలంలో శత్రువుల నుంచి తప్పించుకోవడానికి లేదా యుద్ధ, మందుగుండు సామగ్రి దాచడానికి ‘బంకర్స్’ నిర్మించేవారు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి ఇప్పటికీ చాలా దేశాల్లో బంకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ వార్ సమయంలోని ఓ బంకర్‌ను ప్రస్తుతం ‘గెస్ట్ హౌజ్’లా మార్చేశారు.
బ్రిటన్ తీరంలో సెయింట్-పాబు ఒకప్పుడు రాడార్ స్టేషన్‌గా పనిచేసిన ప్రాంతం. అక్కడ ఇసుక బీచ్‌ల వెంట కాంక్రీట్ బంకర్లను సగానికి పైగా మట్టిలో పాతారు. ఇప్పటికీ ఉత్తర తీరం జర్మన్ సైన్యం వదిలిపెట్టిన కోటలతో నిండి ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తర ఫ్రాన్స్‌లో జర్మన్ దళాలు నిర్మించిన బంకర్‌ను ‘అట్లాంటిక్ వాల్’ ‘ఎల్479’ అని పిలిచేవారు. మిత్రరాజ్యాల దళాలను తప్పించుకోవడానికి దీన్ని ఉపయోగించేవారు. ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసిన సెర్జ్ కొల్లియు అనే వ్యక్తి ఆ బంకర్‌ను ప్రస్తుతం గెస్ట్ హౌజ్‌గా మార్చాడు. 18 నెలల పాటు 400 చదరపు మీటర్ల నిర్మాణాన్ని తవ్వి, పునరుద్ధరించి, ఎనిమిది మందికి సరిపడా గెస్ట్ హౌజ్ నిర్మించగా.. ఇందులో బార్, లివింగ్ రూమ్ కూడా ఉన్నాయి. అయితే బంకర్ L479లో హెల్మెట్, తుపాకులతో కూడిన సంకేతాలు ఇంకా గోడలపై అలాగే ఉన్నాయి.
‘భవనాన్ని నేటి కాలానికి తగినట్లు తీర్చిదిద్దాలనుకున్నాం. గత కాలానికి చెందిన కొన్ని అంశాలను మాత్రం జాగ్రత్తగా భద్రపరిచాము. ఆ బంకర్‌లో చారిత్రాత్మక సూచనలు ఉన్నప్పటికి.. ఇది మ్యూజియం మాత్రం కాదు’ అని సెర్జ్ తెలిపాడు.