విప్ ధిక్కరించిన ఎంపీటీసీలు.. మంత్రికి రోజా ఫిర్యాదు

by srinivas |
విప్ ధిక్కరించిన ఎంపీటీసీలు.. మంత్రికి రోజా ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రపంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నగరి ఎమ్మెల్యే రోజా భేటీ అయ్యారు. తిరుపతిలో ఆదివారం నియోజకవర్గం నేతలతో కలిశారు. నిండ్ర ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. పదేళ్లకాలంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి పదవులు కట్టబెట్టాలని పార్టీ ఆదేశించిందని రోజా స్పష్టం చేశారు.

చక్రపాణిరెడ్డి శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారని మళ్లీ ఆయన సోదరుడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఒకే ఇంట్లో అన్నదమ్ములకు రెండు పదవులు ఎలా ఇస్తారని రోజా నిలదీశారు. ఎంపీటీసీలు పార్టీ విప్‌ను ధిక్క‌రించార‌ని ఆమె మంత్రికి వివ‌రించారు. రెండో సారి విప్ జారీ చేసిన‌ప్ప‌టికీ ఎంపీటీసీలు దాని ప్ర‌కారం న‌డుచుకోలేద‌ని ఆమె చెప్పారు. పార్టీ ఆదేశాల‌ను పాటించుకుండా వ్య‌తిరేక తీరు ప్ర‌ద‌ర్శించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆదివారం రాత్రి నిండ్ర ఎంపీపీ ఎన్నికపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ కొలిక్కి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story