- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్‌కు చోటు.. వారిద్దరిపై వేటు?
దిశ, స్పోర్ట్స్ : తొడ కండరాల గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాట్స్‌మాన్ రోహిత్ శర్మ మూడో టెస్టులో ఆడనున్నట్లు జట్టు యాజమన్యం తెలిపింది. సిడ్నీలో జరగనున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఆడటం ఖాయమే కానీ అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే దానిపై సందిగ్దత నెలకొన్నది. రెండో టెస్టులో పూర్తిగా విఫలమైన మయాంక్ అగర్వాల్, హనుమ విహారిపై వేటు పడే అవకాశం ఉన్నది. శుభమన్‌గిల్‌కు తోడుగా కేఎల్ రాహుల్ లేదా రోహిత్ శర్మ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉన్నది. ఒక వేళ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తే రోహిత్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.
కాగా, ఓపెనింగ్ చేయడానికి రోహిత్ సుముఖత వ్యక్తం చేస్తే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానం మారే అవకాశం ఉన్నది. మరోవైపు గాయం కారణంగా ఉమేష్ యాదవ్ జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్‌కు జట్టులో చోటు కల్పించింది. ఉమేష్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటే నాలుగో టెస్టులో ఆడతాడని జట్టు యాజమాన్యం తెలిపింది. మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్ గాయం కారణంగా వైదొలగడంతో నటరాజన్‌కు అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, జట్టు యాజమాన్యం మాత్రం శార్దుల్ ఠాకూర్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. కాగా, ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న రోహిత్ తాజాగా జట్టుతో కలిశాడు. సహచర క్రికెటర్లు అతడికి ప్రత్యేక స్వాగతం తెలిపింది.