- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ సెట్ అయ్యాడు.. ఆసీస్‌కు చుక్కలే!
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా అభిమానులకు శుభవార్త. తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ నవంబర్ 19 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎన్ఏసీలో రోహిత్ శర్మకు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలు అతడు పాసైనట్లు అక్కడి ఫిజియోథెరపిస్ట్‌లు ప్రకటించారు. ఇవాళ ఎన్ఏసీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, ఒక సెలెక్టర్, ఫిజియో బృందం నిర్వహించిన పరీక్షల్లో అతడు తన ఫిట్‌నెన్‌ను నిరూపించుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఆరోగ్య స్థితి గురించి బీసీసీఐకి కూడా వివరించారు. దీంతో అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎప్పుడు పంపిస్తారనే విషయంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నది.
ఐపీఎల్ సమయంలో తొడకండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గత నెల 19 నుంచి ఎన్ఏసీలో గాయానికి చికిత్స తీసుకోవడంతో పాటు ఫిట్‌నెస్ పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నాడు. బీసీసీఐ వైద్య బృందం, ఎన్ఏసీ ఫిజియోల పర్యవేక్షణలో రోహిత్ శర్మ కోలుకున్నాడు. రోహిత్ శర్మను బీసీసీఐ వెంటనే ఆస్ట్రేలియా పంపించినా.. కరోనా నిబంధనల కారణంగా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కాబట్టి అతడు తొలి టెస్టు ఆడే అవకాశం లేదు. అయితే రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో.. రోహిత్ శర్మతో ఆ స్థానం భర్తీ చేసే అవకాశం లభించింది. నేడో రేపో అతడు ఆస్ట్రేలియాకు బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక రోహిత్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆసీస్‌కు పెను సవాల్ ఎదుర్కొవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.