- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి : రోహిత్ శర్మ
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మరో మూడు రోజుల్లో అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో పింక్ బాల్ (డే/నైట్) టెస్టు ఆడబోతున్నది. ఇండియాలో జరుగుతున్న రెండో పింక్ బాల్ టెస్టు ఇదే కావడంతో అటు క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఆ టెస్టులో రోహిత్ శర్మ ఆడలేదు. ఇక ఈడెన్ గార్డెన్‌లో బంగ్లాదేశ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ్ ఆడినా.. సూర్యాస్తయమం సమయంలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పింక్ బాల్ టెస్టులో ఈ సమయం బ్యాటింగ్ చేసే జట్టుకు కీలకంగా మారుతుంది. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు.
‘సూర్యాస్తమయం సమయంలో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలుసుకున్నాను. సూర్యడి వెలుగు పోయి.. లైట్ల వెలుగు వస్తుంటే ఆ వాతావరణానికి అలవాటు పడుతూ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలర్లకు ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. కానీ బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోతుంటారు. కాబట్టి పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిందే’ అని రోహిత్ శర్మ అన్నాడు. సోమవారం మొతేరా స్టేడియంలో లైట్ల వెలుగులో సాధన చేస్తామని.. తప్పకుండా పింక్ బాల్ టెస్టు పరిస్థితులకు అలవాటు పడతామని రోహిత్ చెప్పాడు.