రోహిణి కోర్టు కాల్పుల ఘటన: మహిళా లాయర్‎కు తీవ్ర గాయాలు!

by Sumithra |   ( Updated:2021-09-24 05:29:17.0  )
రోహిణి కోర్టు కాల్పుల ఘటన: మహిళా లాయర్‎కు తీవ్ర గాయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ రోహిణి కోర్టు కాల్పుల ఘటనలో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ఓ కేసు విషయంలో పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. దీంతో జితేందర్‌తో పాటు ముగ్గురు మృతిచెందారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed