- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 ఏళ్ల క్రితం ట్వీట్.. ఇంగ్లాండ్ క్రికెటర్ సస్పెండ్
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టులోని క్రికెటర్ ఒకరికి ఎనిమిదేళ్ల క్రితం చేసిన విద్వేషపూర్వక ట్వీట్ మెడకు చుట్టుకుంది. న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన ఒలీ రాబిన్‌సన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2012లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో రాబిన్‌సన్ స్త్రీలపై వివక్షతో కూడిన ట్వీట్లు చేశాడు. అంతే కాకుండా అతడు కొన్ని జాతి విద్వేషపూర్వక ట్వీట్లు కూడా చేశాడు. అప్పట్లో తాను తెలిసీ తెలియని వయసులో ఆ ట్వీట్లు చేశానని.. తర్వాత తాను మారిపోయానని.. ఆనాటి ట్వీట్లకు క్షమాపణ చెబుతున్నానని రాబిన్‌సన్ ప్రకటించాడు.
అయినా సరే ఈసీబీ ఏ మాత్రం కనికరించలేదు. తొలి టెస్టు ముగిసిన వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పింది. అతడు వెంటనే జాతీయ శిబిరాన్ని వదిలి ససెక్స్ వెళ్లనున్నట్లు చెప్పింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన రెండో టెస్టుకు అతడిని తప్పించినట్లు పేర్కొన్నది. కాగా, ఓలీ రాబిన్‌సన్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ కలపి 7 వికెట్లు తీశాడు. అంతే కాకుండా బ్యాటుతో కూడా రాణించాడు. రాబిన్ సన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడినట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రశంసించాడు. అయితే అతడు చేసిన ట్వీట్లు తప్పేనని.. అప్పట్లో ఏం జరిగింతో డ్రెస్సింగ్ రూమ్‌లోలో అందరితో షేర్ చేసుకున్నాడని రూట్ అన్నాడు. త్వరలోనే మీడియా ముందుకు వస్తానని కూడా చెప్పాడు. అతడిలో పశ్చాత్తపం కనిపించిందని రూట్ చెప్పాడు.